కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు జలకళ
NEWS Jul 03,2025 04:44 am
ఏపీ, తెలంగాణలో వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లో ఇన్‌ఫ్లో పెరిగింది. జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 70 వేల క్యూసెక్కులుగా ఉండగా.. శ్రీశైలం ఇన్‌ఫ్లో 68వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 63 క్యూసెక్కులుగా ఉంది. గోదావరిపైనున్న శ్రీరామసాగర్‌లో ఇన్‌ఫ్లో రోజురోజుకూ పెరుగుతోంది. వరదల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.