హిమాచల్‌లో వర్షాలకు 51మంది మృతి
NEWS Jul 03,2025 04:32 am
హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలకు 51 మంది మృతి చెందగా, 22 మంది గల్లంతయ్యారు. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. మండీ జిల్లాలో భారీగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.