సిగాచి ఫ్యాక్టరీకి నేడు నిపుణుల కమిటీ
NEWS Jul 03,2025 04:17 am
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. నేడు నిపుణుల కమిటీ ప్రమాద స్థలాన్ని సందర్శించి, ఘటనా కారణాలను విచారించనుంది. మృతుల సంఖ్య 42కు చేరగా, 33 మంది క్షతగాత్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.