ఫిలిప్పీన్స్‌లో కామారెడ్డి విద్యార్థి మృతి
NEWS Jul 03,2025 04:18 am
కామారెడ్డి జిల్లా కుర్లెం గ్రామానికి చెందిన వైద్య విద్యార్థి వడ్ల యోగి (25) ఫిలిప్పీన్స్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన యోగి, తన పుట్టినరోజు రోజే ఈ దుర్ఘటనలో కన్నుమూశాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు ఈ సంఘటనతో శోకంలో మునిగారు. అతడి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.