నియోజకవర్గానికి రెండు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు: రేవంత్ రెడ్డి
NEWS Jul 03,2025 03:41 am
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో రెండు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పదో తరగతి ఉత్తీర్ణులందరూ ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అందించాలని అధికారులకు సూచించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, వారంవారీ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.