సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు విడుదల
NEWS Jul 03,2025 08:18 am
రాజధాని అమరావతి ప్రాంత మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు కృష్ణంరాజుకు ఏపీ హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. వైసీపీకి చెందిన సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో మహిళలపై నీచ వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఆయన్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు తనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దర్యాప్తునకు సహకరించాలని, వారంలో ఒక రోజు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ఆదేశించింది కోర్టు.