ఆలయాల అభివృద్దికి రూ.50 కోట్లు
NEWS Jul 03,2025 03:01 am
కుప్పం రైతులకు మెరుగైన ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. రూ. 850 కోట్లతో ఎయిర్ పోర్టు నిర్మిస్తామన్నారు. ఆలయాల అభివృద్ది కోసం రూ. 50 కోట్లు మంజూరు చేశామన్నారు. చివరి ఆయకట్టు వరకు హంద్రీ నీవా నీళ్లు ఇస్తామని చెప్పారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ది కోసం అద్భుతమైన ప్రణాళిక తయారు చేశామన్నారు. రాబోయే రోజుల్లో ఐటీ, లాజిస్టిక్ కంపెనీలు ఇక్కడికి వస్తాయని తెలిపారు. నాలుగు రాష్ట్రాలకు కేరాఫ్ గా ఉండేలా నాలుగు లేన్ల రహదారులు నిర్మిస్తామన్నారు.