మా దగ్గర చంద్రబాబు కోవర్టులు ఉన్నారు
NEWS Jul 02,2025 09:39 pm
జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కోవర్టులు ఇక్కడ ఉన్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, హైదరాబాద్ లో దందాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఆ కోవర్టుల ఇళ్లకు నల్లా , కరెంట్ కనెక్షన్ కట్ చేయాలని అన్నారు. అప్పుడు కానీ వాళ్లంతా వెళ్లి బనకచర్లను ఆపమని అడుక్కుంటారంటూ పేర్కొన్నారు. ఈ ఆంద్రోళ్లకు మంచిగ చెపితే వినరంటూ ఫైర్ అయ్యారు.