రూ.850 కోట్లతో కుప్పంలో విమానాశ్రయం
NEWS Jul 02,2025 01:52 pm
కుప్పంలో రూ. 850 కోట్లతో ఎయిర్ పోర్ట్ నిర్మిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. విమానాశ్రయం కోసం స్వచ్చంధంగా భూములు ఇవ్వాలని పిలుపునిచ్చారు. రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన వారికి మెరుగైన ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడం జరిగిందన్నారు. వారంతా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి ఇంటిపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు.