హరీశ్ రావుకు అంత సీన్ లేదు
NEWS Jul 02,2025 01:49 pm
మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పేవన్నీ అబద్దాలేనని మండిపడ్డారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుకు అబద్ధాలు చెబితే తప్ప జీవితం గడవదన్నారు. బనకచర్లకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ముడిపెట్టి వాళ్లు చేసిన కుట్రను తాము ముందే పసిగట్టమన్నారు. ఉద్యమ సమయంలో ఉన్న సెంటిమెంట్ ను మళ్లీ తీసుకొచ్చి తమ మనుగడను కాపాడు కోవాలని ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.