ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెల రోజులు సేవ చేయండి: రేవంత్
NEWS Jul 02,2025 12:09 pm
సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యులను సామాజిక బాధ్యతగా ఏడాదికి ఒక నెల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందించాలని కోరారు. బంజారాహిల్స్‌లో ఏఐజీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు 25 కొత్త ఆసుపత్రులు నిర్మిస్తున్నామని, విద్యకు రూ.21,500 కోట్లు, ఆరోగ్యానికి రూ.11,500 కోట్లు కేటాయించామని తెలిపారు.