చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం: హరీశ్ రావు
NEWS Jul 02,2025 08:24 am
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య బనకచర్ల ప్రాజెక్టుపై చీకటి ఒప్పందం ఉందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని, బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ కుట్రను బయటపెట్టిందని తెలిపారు. చంద్రబాబు లేఖలతో నిధులు మంజూరైనా రేవంత్ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని విమర్శించారు.