సచివాలయ సిబ్బంది నిర్లక్ష్య ధోరణి
NEWS Jul 02,2025 12:12 pm
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట (మం) కొమ్మలపూడి గ్రామ సచివాలయాన్ని మధ్యాహ్నం 12 దాటినా తెరవలేదు. దీంతో.. పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు ఎదురుచూస్తున్నారు. ఫోన్ చేసినా సచివాలయ సిబ్బంది స్పందించడం లేదని వారు వాపోతున్నారు. సమయపాలన లేని సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.