ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు
NEWS Jul 02,2025 09:43 am
అమెరికాలోని శ్రీశ్రీ రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు దుండగులు. ఆలయం లోపల భక్తులు ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని శాన్ ఫ్రాన్సిస్కో లోని భారత్ కాన్సులేట్ జనరల్ ప్రభుత్వాన్ని కోరారు. సుమారు 20 నుంచి 30కి పైగా బుల్లెట్లు ఆలయ గోడల్లోకి దూసుకు వెళ్లినట్లు సమాచారం.