ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది. మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సభలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని.. చెన్నైలోని అన్నానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మద్రాస్ హైకోర్టు నిబంధనలను పవన్ ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.