ఖాకీల తీరుపై హైకోర్టు కన్నెర్ర
NEWS Jul 02,2025 09:19 am
తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు సివిల్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయంటూ మండిపడింది. సివిల్ కేసుల్లో ఎలా జోక్యం చేసుకుంటారంటూ ప్రశ్నించింది. సెటిల్మెంట్లు తారా స్థాయికి చేరుతున్నాయని, వెంటనే పోలీసులకు కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ వో పీ) రూపొందించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. రాచకొండ కమిషనర్, నాగోల్ పీఎస్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.