హైదరాబాద్‌లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు
NEWS Jul 02,2025 03:50 am
వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు హైదరాబాద్‌లో 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లను రంగంలోకి దించినట్లు తెలిపారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఈ టీమ్ ల్లో 1800 మంది ఉంటారని తెలిపారు. వీరికి తోడు డీఆర్ఎఫ్ బృందాలు కూడా పని చేస్తాయన్నారు. 21 బైకు బృందాలు సైతం అదనపు సేవలు అందిస్తాయని పేర్కొన్నారు. 30 సర్కిళ్లల్లో 30 మంది మార్షల్స్ పని చేస్తారని వెల్లడించారు.