చీఫ్ ఇంజనీర్ ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే..
NEWS Jul 02,2025 06:30 am
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. చీఫ్ ఇంజనీర్ సైతం క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని స్పష్టం చేశారు. బిల్లులు త్వరగా క్లియర్ చేస్తున్నామని, అదే స్థాయిలో పనులు కూడా వేగంగా పూర్తి కావాలన్నారు. సీఎం తమ శాఖ పట్ల సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. శాఖలో ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్స్ , పోస్టింగ్స్ ఇచ్చామన్నారు. ఇప్పటికైనా తమ పనితీరు మార్చుకోవాలని, ప్రోగ్రెస్ చూపించాలని అన్నారు.