మంత్రి కొండా సురేఖపై ఈసీకి ఫిర్యాదు
NEWS Jul 02,2025 08:37 am
మంత్రి కొండా సురేఖపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. ఆమెపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి భరత్ కుమార్ తో కలిసి రాష్ట్ర ఎన్నికల అధికారి హరి సింగ్ కు ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో రూ. 70 కోట్లు ఖర్చు చేసి గెలిచామని సురేఖ భర్త కొండా మురళి చెప్పారని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి గెలవడం చట్ట విరుద్దమని పేర్కొన్నారు.