బనకచర్ల ప్రాజెక్టుకు కారణం కేసీఆర్ - సీఎం
NEWS Jul 01,2025 09:15 pm
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తే రూ. 7 వేల కోట్లు కరెంట్ బిల్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేవలం 50 వేల ఎకరాలకే నీళ్లు ఇచ్చారన్నారు. 2007లో 34 వేల కోట్లతో గోదావరిపై ప్రాణహిత- చేవెళ్లను వైఎస్సార్ ప్రారంభిస్తే 2014లో కేసీఆర్ ఊరు, పేరు, అంచనాలు మార్చేసి లక్షన్నర కోట్లతో కాళేశ్వరం కట్టారన్నారు. ఇవాళ ఏపీ సర్కార్ బనకచర్ల ప్రాజెక్టు చేపట్టేందుకు కేసీఆరే కారణమని సంచలన ఆరోపణలు చేశారు.