చేనేత కార్మికులకు సర్కార్ శుభవార్త
NEWS Jul 01,2025 08:25 pm
తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.33 కోట్ల రుణమాఫీని ప్రకటించింది. "తెలంగాణ చేనేత అభయహస్తం" పథకం కింద రూ.168 కోట్లు, "నేతన్నకు చేయూత" పథకం ద్వారా 36,133 మంది కార్మికులకు రూ.290.09 కోట్లు మంజూరు చేసింది. అలాగే, TGSCOకి రూ.494.48 కోట్లు విడుదల చేసి, చేనేత సహకార సంఘాల బకాయిలను క్లియర్ చేసింది.