కేసీఆర్, హరీష్‌లపై సీఎం రేవంత్ ఫైర్
NEWS Jul 01,2025 08:07 pm
తెలంగాణ నీటి హక్కులను కాపాడతారని భావించిన కేసీఆర్, హరీష్ రావులే రాష్ట్రానికి తీరని నష్టం చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. కృష్ణానదిలో 811 టీఎంసీలలో తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే కేటాయించి, ఏపీకి 512 టీఎంసీలు ఇచ్చేలా కేసీఆర్ సంతకం చేయడం వల్ల రాష్ట్రాని అన్యాయం జరిగిందని రేవంత్ విమర్శించారు.