ఈ నెల 14న రేషన్ కార్డుల పంపిణీ
NEWS Jul 01,2025 05:50 pm
తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల పంపిణీని ఈనెల 14 నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది. తుంగతుర్తిలో లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని సీఎస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి రేషన్ కార్డులను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.