పార్టీ పెట్టినప్పుడు నేను, మా అమ్మే ఉన్నాం..
NEWS Jul 01,2025 11:58 am
మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసిన సమయంలో తనతో పాటు తన తల్లి విజయమ్మ మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఆనాటి పార్టీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అందరూ కొత్తవాళ్లే, మాపై ప్రేమ, అభిమానం ఉన్న వాళ్లు నాతో వచ్చారన్నారు. ఆనాటి నుంచే నా ప్రస్తానం మొదలైందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశామన్నారు. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా రాజీపడ లేదన్నారు.