బీసీలను మోసం చేసిన బీజేపీ
NEWS Jul 01,2025 04:34 pm
బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు చిరంజీవులు నిప్పులు చెరిగారు. తాజాగా జరిగిన బీజేపీ అధ్యక్ష పదవిని బహుజనులకు రాకుండా చేశారంటూ ఆరోపించారు. ఎంతో మంది ఎంపీలు ఉన్నా కేవలం అగ్ర కులాలకే ప్రయారిటీ ఇచ్చారని ఆరోపించారు. గత కొన్నేళ్లుగా అన్ని పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే బీసీలు గుర్తుకు వస్తారని ఆ తర్వాత మరిచి పోతారంటూ ఫైర్ అయ్యారు.