కాలుష్య నివారణకు ఢిల్లీ సర్కార్ కఠిన చర్యలు
NEWS Jul 01,2025 04:10 pm
ఢిల్లీ సర్కార్ జూలు విదిల్చింది. కాలుష్య నివారణకు చర్యలు చేపట్టింది. గడువు ముగిసిన వాహనాలకు ఇకపై పెట్రోల్, డీజిల్ ఇవ్వకూడదని ఆదేశించింది. 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇది వర్తిస్తుంది. ఆయా పెట్రోల్ బంకుల వద్దే పాత వెహికల్స్ గుర్తిస్తారని పేర్కొంది. 520 పెట్రోల్, డీజిల్ బంకుల్లో నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది.