పాశమైలారం ఘటనలో అధికారులపై సీఎం ఆగ్రహం
NEWS Jul 01,2025 12:24 pm
పాశమైలారం ఘటనలో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సంబంధిత శాఖ అధికారులు, బాయిలర్స్ డైరెక్టర్స్ తనిఖీలు చేశారా అని ప్రశ్నించారు. ఏమైనా సమస్యలు ఉన్నట్లు గుర్తించారా , యాజమాన్యానికి సూచనలు చేశారా అని ఆరా తీశారు. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధ్యయనం చేయాలని.. ఊహాజనిత సమాధానాలు చెప్పవద్దన్నారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.