రాజాసింగ్ ఆరోపణలు అబద్దం
NEWS Jul 01,2025 10:29 am
ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఆరోపణలపై స్పందించింది బీజేపీ. తను నామినేషన్ వేసేందుకు ఛాన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపింది. రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్టకు చేరిందని ఆరోపించింది. పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డికి సమర్పించిన రాజీనామా పత్రాన్ని జాతీయ అధ్యక్షుడికి పంపించడం జరుగుతుందని పేర్కొంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే, లేఖను స్పీకర్‌కు సమర్పించాలని సూచించింది. గతంలో కూడా ఇలాంటి క్రమశిక్షణ రాహిత్య వ్యవహారాలతో సస్పెండ్ అయితే మళ్లీ పార్టీలోకి తీసుకున్నామని తెలిపింది. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని వెల్లడించింది.