శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
NEWS Jul 01,2025 04:40 am
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 1,00,085 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 874.30 అడుగుల మేర నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 214.7080 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 160.5282 టీఎంసీలుగా ఉంది. వరద ఉధృతి పెరుగుతుండటంతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశముంది.