మృతుల కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలి
NEWS Jul 01,2025 09:29 am
సిగాచి పరిశ్రమలో చోటు చేసుకున్న పేలుడు ఘటనలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 37 మంది ప్రాణాలు కోల్పోగా 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన హరీశ్ రావు వెంటనే మృతి చెందిన కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఇవ్వాలని, క్షతగాత్రులకు రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటనకు జరిగిన కారణాలు ఏమిటో ఇప్పటి వరకు తెలియక పోవడం దారుణమన్నారు.