సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాల్టితో 37కి చేరింది. రాష్ట్ర చరిత్రలో ఇదే అతి పెద్ద ఘటన కావడం గమనార్హం. మరో 33 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 20 మంది ఇప్పటి వరకు జాడ లేదు. దీంతో మరింత మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.