ఆకతాయిలకు ఒంగోలు డీఎస్పీ కౌన్సెలింగ్
NEWS Jul 01,2025 08:41 am
ఈవ్ టీజర్లు, ట్రిపుల్ రైడింగ్, బైక్ రేసర్ల ఆటకట్టించారు ఒంగోలు పోలీసులు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గత రాత్రి మొత్తం 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 33 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసరావు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. సీఐ నాగరాజు, ఎస్ఐలు సాంబశివరావు, సందీప్, సుబ్రహ్మణ్యం, పోలీసులు ఈ డ్రైవ్‌లో పాల్గొన్నారు.