రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన 38వ జాతీయ క్రీడా పోటీల్లో సత్తా చాటి పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ మేరకు మొత్తం రూ.91.75 లక్షల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.