బీజేపీని అధికారంలోకి తేవడమే ధ్యేయం
NEWS Jun 30,2025 04:43 pm
బీజేపీ నూతన అధ్యక్షుడిగా పేరు ఖరారు కావడంతో ఎన్.రామచందర్ రావు స్పందించారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ తను ఒక్కడినే నామినేషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ సందర్బంగా రామచందర్ రావు మీడియాతో మాట్లాడారు. అధికారికంగా తన పేరు ప్రకటించలేదని, అయినా హై కమాండ్ కు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని తెలిపారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరితో కలుపుకుని పోతానని, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తానన్నారు.