స్మార్ట్ సిటీస్ మిషన్ కార్యక్రమంపై సమీక్షించిన మాగుంట
NEWS Jun 30,2025 09:48 pm
ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలోని కమిటీ హాలులో స్మార్ట్ సిటీస్ మిషన్ అనే అంశంపై జరిగిన సమావేశంలో గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కమిటీ చైర్మన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. మాగుంట మాట్లాడుతూ స్మార్ట్ సిటీస్ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖా ప్రతినిధులతో సమీక్షించారు. ఎంపిక చేసిన స్మార్ట్ సిటీస్ ని త్వరగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు.