పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సూచించారు. కనిగిరి ప్రభుత్వ వైద్యశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడున్న రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు.