గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళన
NEWS Jun 30,2025 09:59 pm
కనిగిరిలోని పొగాకు వేలం కేంద్రం వద్దె గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు వేలాన్ని ఆపేసి నిరసన వ్యక్తం చేశారు. కేవలం ఏ గ్రేడ్ పొగాకు మాత్రమే కొంటున్నారని, లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయడం లేదంటూ రైతు సంఘం నాయకుడు పిల్లి తిప్పారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు వేలం కేంద్రం అధికారులు, బయ్యర్లు ఏకమై రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.