వరంగల్ రాజకీయాలు రోజు రోజుకు మారి పోతున్నాయి. మంత్రి వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఈ తరుణంలో ఉన్నట్టుండి తాను పరకాల నుంచి పోటీ చేస్తానంటూ కీలక ప్రకటన చేశారు కొండా దంపతుల కూతురు సుస్మిత. సోషల్ మీడియా అకౌంట్ లో కూడా అప్ డేట్ చేయడం కలకలం రేపుతోంది పార్టీలో.