బీఆర్ఎస్ ను బద్నాం చేస్తే ఊరుకోం
NEWS Jun 30,2025 09:14 am
సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్. తమ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల గురించి లేని పోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యకర్తలు అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోలేదన్నారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావాలని దుష్ప్రచారం చేస్తోందని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.