తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిట
NEWS Jun 30,2025 09:08 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని 88 వేల 497 మంది దర్శించుకున్నారు. 29 వేల 54 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.34 కోట్లు వచ్చిందని ఈవో జె. శ్యామల రావు వెల్లడించారు. ప్రస్తుతం దర్శనం కోసం 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 10 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.