కోరుట్ల పట్టణంలో కత్తిపోట్ల ఘటన కలకలం. పట్టణంలోని రవీంద్ర రోడ్ సమీపంలో సత్యనారాయణ అనే వ్యక్తిపై గంగ నర్సయ్య అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. స్థానికులు సత్యనారాయణను కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించారు. కోరుట్ల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.