సోషల్ మీడియా యమ డేంజర్ - సీఎం
NEWS Jun 29,2025 08:18 pm
ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాపై ఫైర్ అయ్యారు. సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారిందన్నారు. రాజకీయాలు అప్పటి లాగా లేవన్నారు. ఆర్థిక ఉగ్రవాదులు ఇందులోకి వస్తున్నారంటూ మండిపడ్డారు. 2019లో మనం గెలిచి ఉంటే రాష్ట్రం వేరేలా ఉండేదన్నారు. దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చి దిద్దేవాడినని చెప్పారు. జగన్ ను ఏకి పారేశారు. రౌడీషీటర్, గంజాయి బ్యాచ్ ను పరామర్శించడం దారుణమన్నారు. పాస్టర్ చని పోతే దానిని కూటమి సర్కార్ పై నెట్టి వేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు.