మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కన్నెర్ర చేశారు. వైసీపీ కార్యకర్తలు తమ శత్రువులు కారని స్పష్టం చేశారు. ఆయన ఇంటికి ఎవరు వెళ్లినా వారి భరతం పడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి అడుగు పెట్టకుండా అడ్డుకుని తీరుతామన్నారు. త్వరలోనే తమ కార్యకర్తలు తన ఇంటిని జేసీబీలతో వచ్చి కూల్చి వేయడం ఖాయమన్నారు.