ఏపీలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం
NEWS Jun 29,2025 05:45 pm
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దారుణంగా తయారైందని అన్నారు మాజీ సీఎం జగన్ రెడ్డి. ఏపీఈసెట్ అడ్మిషన్స్ ఇప్పటి వరకు చేపట్టక పోవడం పట్ల మండిపడ్డారు. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదన్నారు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం 34వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. గతనెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయక పోవడం పట్ల ఫైర్ అయ్యారు.