శ్రీశక్తి పీఠం అభివృద్దికి టీటీడీ సహకారం
NEWS Jun 29,2025 05:41 pm
శ్రీశక్తిపీఠంలో వారాహి నవరాత్రుల ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయని అన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. భక్తుల్లో భక్తి భావాన్ని పెంచే అనేక కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. శ్రీశక్తిపీఠం అబివృద్థికి టిటిడి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. పాలకమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను అభినందించిన పీఠాధిపతులకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీవారి భక్తులకు నిరంతరం సేవ చేస్తూనే ఉంటానని అన్నారు. దళిత వాడల్లో 500 ఆలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.