స్వేచ్ఛ కేసులో లొంగిపోయిన పూర్ణ చందర్
NEWS Jun 29,2025 12:15 pm
టీ న్యూస్ స్పెషల్ కరెస్పాండెంట్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో చిక్కడపల్లి పీఎస్ లో లొంగి పోయాడు పూర్ణ చందర్ రావు. తన కూతురు సూసైడ్ చేసుకునేందుకు తనే కారకుడంటూ పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న వెంటనే పరారయ్యాడు. తర్వాత పోలీసుల ముందు ప్రత్యక్షం అయ్యాడు. ఈ సందర్బంగా లేఖ విడుదల చేశాడు. తన మృతికి మానసిక పరిస్థితి బాగా లేక పోవడం, పేరెంట్స్ నిర్లక్ష్యమే కారణమంటూ నిందలు మోపాడు. హైడ్రామా మధ్య రాత్రి 11 గంటల సమయంలో లాయర్ తో కలిసి వచ్చి లొంగి పోయాడు.