రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. కొండపి మండలం పెరిదేపిలో ఎమ్మెస్ విజ్ఞాన కేంద్రంలో మండల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం కంటే సంక్షేమ పథకాలు రెట్టింపుకు అమలు చేస్తామని సంక్షేమ అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్ళని చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చి సంవత్సరం నడుస్తున్న ఎన్నికల నాటి హామీలు పెద్దగా వరగపెట్టింది ఏమీ లేదన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడు అమలు చేస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు.