చంద్రశేఖర్ పురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో వెలసి ఉన్న నారాయణస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు ఉదయాన్నే మిట్టపాలెం చేరుకొని స్వామివారికి పొంగళ్ళు నైవేద్యంగా పెట్టి తమ మొక్కలను తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం గో పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు