పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించారని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొత్తవి కట్టకపోగా పాత వాటిని నాశనం చేశారని మండిపడ్డారు. పదేళ్ల పాటు ప్రాజెక్టులకు ఎటువంటి మెయింటెనెన్స్ చేయ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లకు కక్కుర్తి పడ్డారంటూ మండిపడ్డారు.