హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్‌లో వాహనదారుల ట్రాఫిక్ కష్టాలకు ఉపశమనం కలిగిస్తూ మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. కొండాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.